స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!
ఓ ఆపిల్ వాచ్.. ప్రమాదం నుంచి ముంబై టెక్కీ ప్రాణాలు కాపాడింది. ఇది వాస్తవం. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించింది. ఎలా? ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవండి. 26 ఏళ్ల టెక్కీ క్షితిజ్ జోడాపే ముంబై వాసి. ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2020 నుంచి డైవింగ్ చేస్తున్న అలవాటు ఉంది. ఈ వేసవిలో పుదుచ్చేరి సమీపంలో స్కూబా డైవింగ్‌కు వెళ్లాడు. సముద్రంలో 36 కిలోమీటర్ల దూరంలో నీటి అడుగున ఉన్నప్పుడు అతడు ధరించిన పరికారాలు పనిచేయడం మానేశాయి. వెయిట్ బెల్ట్ అకస్మాత్తుగా వదులైపోయింది. వెంటనే ఉపరితలం వైపు వేగంగా పైకి లేచే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి ప్రాణాలకు ముప్పు పొంచికొచ్చింది. అయితే అతడి మణికట్టుకు కట్టిన ఆపిల్ వాచ్ అల్ట్రా అకస్మాత్తుగా నిలువుగా పైకి లేవడాన్ని పసిగట్టింది. వెంటనే స్క్రీన్‌పై హెచ్చరికలు రావడం మొదలయ్యాయి. వేగంగా పైకి లేవడం కారణంగా ఊపిరితిత్తులకు తీవ్రగాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేగం తగ్గించాలంటూ ఆపిల్ వాచ్ అల్ట్రా వార్నింగ్ ఇచ్చింది. ఇక పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో వెంటనే గడియారం అత్యవసర సైరన్ మోగించడం ప్రారంభించింది.
చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ సినిమా
శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్య రావు మదాడి, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్ .5 ని ప్రారంభించారు. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నారు. గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాజధాని నిర్మాణం లో మరో కీలక ముందడుగు పడింది.రాజధాని అమరావతి కోసం భూ సేకరణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భూములు ఇవ్వని కొందరు రైతుల నుంచి. భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్. లో నిర్ణయం తీస్కున్నారు మేరకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, జలవనరుల శాఖ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదించింది. కారవాన్ పర్యాటకానికి ఆమోదం లభించింది. అమృత్ 2.0 పథకం పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అమరావతిలో పనుల కోసం ఎస్‌పీవీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇక, ‘కుష్టు వ్యాధి’ పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు ఆమోదం తెలిపారు. అలాగే, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు సైతం మంత్రి మండలి ఆమోదం లభించింది.
అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు.. పరోక్షంగా స్పందించిన సీఎం చంద్రబాబు..
మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు.. తమ జిల్లా పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదే.. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇంఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖా పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలి.. చరిత్రలో తొలిసారి 93 శాతం రిజర్వాయర్లు నీటిని నింపాం.. విజన్ 2047కు పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇదో కీలక పరిణామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, చామ్ విధానంలో పట్టణాభివృద్ధి చేపట్టిన నిర్మాణాలు ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిన విషయాలు మంత్రులతో పంచుకున్నారు. ఏ పథకం ద్వారా దాదాపు రూ. 65 వేల కోట్లు ఉద్యాన, ఆక్వా రంగాలకు వచ్చే అవకాశం ఉంది. యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.. విజయవాడ ఉత్సవ్ తరహాలో నెలకో ఈవెంట్ రాష్ట్రంలో స్థానిక పండుగల్ని ప్రోత్సహించేలా అన్ని ప్రాంతాల్లో చేపట్టాలి అన్నారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028కల్లా పూర్తి చేస్తాం.. కర్నూల్ లో ఈ నెల 16వ తేదీన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఆర్కే నాయుడు పాన్ ఇండియా సినిమా
‘ది 100’ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికుల దుర్భరమైన జీవితాలు, వారి కష్టాలను తెరపై ఆవిష్కరించేందుకు ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ‘జార్జి రెడ్డి’ చిత్రంతో మేకర్‌గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలలో జరిగే ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్మిడీయట్ పరీక్షల టైం టేబుల్ ను బోర్డు ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్ కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు. కాగా, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన మొదలుకొని మార్చి 24వ తేదీ వరకూ వివిధ కోర్సులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అలాగే, ద్వీతీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరగనుంది. పర్యావరణ పరిరక్షణ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వ తేదీ వరకూ జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు పెట్టనున్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకూ ఒకేషనల్ కోర్సులకు, సమగ్ర శిక్షా ఓకేషనల్ ట్రేడ్ పరీక్ష ఫిబ్రవరి 13వ తేదీన నిర్వహించనున్నట్టు షెడ్యూల్ లో వెల్లడించింది. ఈ షెడ్యూల్ తాత్కాలికమని 2026 హలిడేస్ క్యాలెండర్ ఆధారంగా కొన్ని డేట్లు మారే అవకాశం ఉందన్నారు.
కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి బీజేపీ ఖాతాలో చేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు జరగాలని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని సంజయ్ తెలిపారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధులేమీ లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా మంది అప్పులు తీరచేయలేక ఊళ్లను వదిలి నగరాలకు వలస వెళ్ళారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తెచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రజలంతా కసరత్తు చేస్తున్నారు” అని అన్నారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటైన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రస్తుతం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభించినట్టు ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును బహుముఖంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ స్కూల్ విద్యా ప్రణాళికను రూపొందించింది. ఇక్కడ చదువుతో పాటు క్రీడలు, విలువలతో కూడిన బోధన, నైపుణ్యాల అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విద్యాసంస్థలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, క్రీడలు, కో-కరిక్యులర్ కార్యకలాపాలలో కూడా ప్రతిభ చూపే అవకాశాన్ని పొందుతారు. పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయడం, క్రమశిక్షణను అలవరచడం, సమాజంపై బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడం స్కూల్ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా, నాయకత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేలా బోధన వ్యవస్థను అమలు చేస్తున్నారు.
ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధికారులతు తీవ్ర కసరత్తు చేస్తోంది. గత కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి భిన్నంగా పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. ఇక మద్యం తాగే వయసును కూడా కుదించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు 25 ఏళ్ల వయసు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదించే అవకాశం ఉంది. ఇకపై 21 ఏళ్లకే మద్యం సేవించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది.
అవుకు రిజర్వాయర్ కు గండి.. మంత్రి జనార్థన్ రెడ్డి ఆదేశాలు
నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ తిమ్మరాజు ఆనకట్ట దగ్గర రివిట్ 2 అడుగుల మేరకు కుంగింది. రిజర్వాయర్ ఆనకట్ట నుంచి నీరు లీకేజ్ అవుతూ.. బయటికి వస్తుండటం స్థానిక ప్రజల్లో భయాందోళన రేపుతుంది. రివిట్ కుంగిన ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టం 3.65 టీఎంసీల నీరు ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తం అవుతూ, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి నుంచి ఎస్సార్బీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రివిట్ కుంగిన ఘటనపై పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.