తెలంగాణ ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పలు చిన్న పార్టీలకు గుర్తింపు రద్దు హెచ్చరికగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం, అవసరమైన పత్రాలు సమర్పించని లేదా షరతులు పూర్తి చేయని పార్టీలు ఈ చర్యకు లక్ష్యమయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్ కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం ఇంజన్ ఆయిల్ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, అన్నం, చపాతీకి బదులుగా 7-8…
గోల్నాకకు చెందిన భవాని అనే మహిళా, భర్తతో గొడవపడి సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గత రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
వికారాబాద్ జిల్లాలోని ఫుల్మద్ది గ్రామంలో ఒకే రోజు రెండు విషాదాలు చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అత్త మరణంతో శ్రద్ధాంజలి బ్యానర్‌ను తీసుకుని వెళ్తున్న అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Group 1 Parents: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ACB Raids: హైదరాబాదులో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు మరో మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేడ్కర్ నివాసం ఉంటున్నారు. నాననక్రాంగూడలోని ఆంట్యార్ అబ్డే అపార్ట్మెంట్ లోని అంబేడ్కర్ పర్సనల్ కార్యాలయం ఉంది.
తాడిపత్రిలో పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపు వివాదం చెలరేగుతుంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి పట్టణ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలనా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదన్నారు. ఇంకా, పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో బందోబస్తును కేతిరెడ్డికి కల్పిస్తూ.. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం…
అస్సాంలో భారీ భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు! అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది.…