Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. పలు చోట్ల పటాకులు కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు.
Read also: 1,200 Gifts received by PM Modi to be Auctioned : ప్రధాని మోడీ బహుమతుల వేలం
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి పరిదిలోని మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సభకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి భారీ ర్యాలీగా ఎంఎల్ సి, ఎంఎల్ఎ ఆద్వర్యంలో వేలాదిమంది నాయకులు,కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో సంస్క్రృతిక కార్యక్రమాలతో, అలరిస్తున్నారు సింగర్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్. వజ్రోత్సవాల్లో ఇండియన్ ఐడల్ శ్రీరామ్ మాయదారి మైసమ్మె మైసమా.. మనం మైసారం పోదమే మైసమ్మా అనే పాట పాడారు. ఆ పాటకి స్టేజ్ దద్దరిల్లింది. ప్రముఖ సింగర్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పాటకి ఎంఎల్ సి శంభీపూర్ రాజు, ఎంఎల్ఎ వివేకానంద, కార్పొరేటర్లు.. స్టేజ్ పై స్టెప్పులేసి అక్కడున్న వారందరిని ఉత్తేజపరిచారు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Minister Seediri Appalaraju: పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుంటాం.. మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా?