Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం! భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన…
హైదరాబాద్ మెట్రో రైలు దేశంలో అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు ఐదు లక్షల ప్రయాణికులకు సేవలందిస్తూ, నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీ ప్రయాణికుల్లో మహిళల శాతం సుమారు 30 ఉండటంతో, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా నిలుస్తున్నాయి. సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా,…
Shamirpet Police Station : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో…
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు…
Special : హైదరాబాద్… ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే, నగరంలో ఎటు చూసినా గాలిలో వేలాడుతున్న కేబుల్స్, వైర్ల జంక్షన్లు నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు కమ్యూనికేషన్ లైన్ల గందరగోళం నిత్య సమస్యగా మారుతోంది. గాలిలో వేలాడుతున్న ఈ ట్యాంగిల్డ్ వైర్స్ కేవలం నగర అందాన్ని దెబ్బతీయడమే కాదు, యాక్సిడెంట్లకు కూడా కారణం అవుతున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ ఓవర్హెడ్ లైన్స్ నిర్వహణ అనేది పెద్ద టాస్క్గా మారుతోంది.…
IBomma Ravi : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సీసీఎస్ పోలీసులు వాదించగా, కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఇప్పటికే…
మానవసేవే మాధవసేవ అన్న నానుడి స్ఫూర్తిగా తీసుకున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సామాజిక సేవపై దృష్టి సాధించాడు. అతనే అవధానాల వసంత శర్మ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన అవధానుల వసంతశర్మ (81) విశ్రాంత ఉపాధ్యాయుడు. 2004 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొంది శేష జీవితం గడుపుతున్నారు. 2000 సంవత్సరం నుంచి నేటికీ ప్రతిరోజూ ఉదయం మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో రోగులకు వారి బంధువులకు ఉచితంగా పాలు పోస్తూ బిస్కెట్లను అందిస్తున్నారు. Railway Rules:…
Madapur IT Scam: మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్లో కలకలం రేపుతోంది. స్థానికంగా పేరొందినట్టు నటిస్తూ కార్యకలాపాలు నిర్వహించిన NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం బయటపడింది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి…