Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ.. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వేగంగా పెరుగుతున్న అర్బన్ అభివృద్ధిని క్రమబద్ధీకరించేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1.…
ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును ఇచ్చిన ధ్వజం శిఖరమెక్కింది భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈరోజు భారతీయుల కల నెరవేరిన రోజు అని పేర్కొన్నారు. రామ మందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. ఈరోజు వారి ఆత్మలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, వీహెచ్‌పీ నేత దాల్మియా,…
IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్‌కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది.…
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల…
ESI Hospital Tragedy: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో జరిగిన భయానక ప్రమాదం కలకలం రేపింది. ఆసుపత్రిలో కొనసాగుతున్న రెనోవేషన్ పనుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ ఆకస్మికంగా కుప్పకూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి టీజీ…
Telangana : తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో మొత్తం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం జమ చేసింది. ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా డీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వర్చువల్…
ESI Hospital : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో సెంట్రింగ్ పనులు కొనసాగుతుండగా అర్ధంతరంగా శిథిలాలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం ప్రకారం.. ఆస్పత్రి భవనంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి అక్కడ పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులపై పడింది. వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా కాంక్రీట్ ముక్కలు నేరుగా వారి మీదపడటంతో…
CM Revanth Reddy : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పట్టణాభివృద్ధి నుంచి విద్య, సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ పనులు ప్రారంభమవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, నియోజకవర్గంలో మొత్తం 28 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.5.83 కోట్లు, అలాగే ప్రభుత్వ…
CP Sajjanar: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ చేశారు. రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు చెప్పిన అడ్రస్సులో ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు.
Lover Suicide: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల జిల్లెల్లగూడలోని డీఎన్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మదన్ యాదవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.