Jagtial: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదనో, లేక ఫోన్ కొనివ్వలేదో ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చూశాం.. గేమ్స్ ఆడొద్దని కట్టడి చేసిన పిల్లలు సైతం బలవన్మరణానికి పాల్పడటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పిల్లాడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన ఎవ్వరి వల్లో రాలేదు.. కన్న తల్లిదండ్రుల వల్లే వచ్చింది. తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.
Harish Rao: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైంది? ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా "బాధితులకు రూ.…
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది.
Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.