Balmoor Venkat : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తక్కువ కాలంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, గతంలో బీఆర్‌ఎస్ చేయని పనులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే దీన్ని ధ్రువీకరిస్తుందని తెలిపారు. ఇంటర్ పరీక్షల పేపర్ లీక్ నుంచి గ్రూప్-1 పరీక్షల లీక్ వరకు జరిగిన అనేక ఘటనలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వెంకట్ ఆరోపించారు. మీ హయంలో…
TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడీఎస్ వెర్హౌస్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పాత…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్టర్ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు నిర్వహించకపోవడం నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో విద్య రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం…
Bhatti Vikramarka : నగరంలోని సైబర్ గార్డెన్‌లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.…
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో…
తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు.
Komatireddy Venkat Reddy : ఆర్ & బీ శాఖలో ఏఈఈల ఆరేళ్ల నిరీక్షణకు తెరదించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకే రోజు 118 మంది ఏఈఈ లకు డీఈఈ లుగా పదోన్నత లభించింది. దీంతో ఆర్ & బీ లో ఏఈఈ లు సంతోషంలో మునిగిపోయారు. డీపీసీ ప్యానల్ నిబంధనల మేరకు 118 మందికి పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. ఏఈఈల ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సాఫీగా…
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్…