తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా.. ఈరోజు జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు 20,921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,37,865 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 4,16,964 మందే పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. మొత్తంగా 4.7% విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇండిర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్‌లలో ఒక్కోటి చొప్పున మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు…