వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభమైందన్నది సంతోషకర విషయం.
DGP Jithender : తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (FTCCI) ఆధ్వర్యంలో మెరుగైన పోలీస్ నిఘా , ప్రజా భద్రతపై రాష్ట్ర డీజీపీ జితేందర్‌తో కీలక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సాంకేతిక పోలీసింగ్, సైబర్ భద్రత, మహిళా ఉద్యోగుల రక్షణ, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల భద్రతా సహకారంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య భద్రత విషయంలో అంతరాన్ని తగ్గించడమే ఈ సమావేశ ఉద్దేశం. పరిశ్రమల…
KTR : తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని…
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ – రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్…