OTR: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానమైన రెండు సంఘాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల సచివాలయంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమమే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది ఉద్యోగ వర్గాల్లో. అసలే ఉద్యోగ సంఘాల్లో ఉన్న సమస్యలకు ఈ వ్యవహారం ఆజ్యం పోసిందన్నది కొందరి విశ్లేషణ. ప్రస్తుతం ఉద్యోగుల జేఏసీలో సుమారు 208 సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో లక్షా 25వేల మంది ఉద్యోగులున్న…