తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మాజీ ప్రధాని ‘ఇందిరా గాంధీ’ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కోటి మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తోందని ఆయన చెప్పారు. నెక్లెస్ రోడ్డులో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంను సీఎం ప్రారంభించనున్నారు.
కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించనుంది. బుధవారం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ ఉంటుంది. నవంబర్ 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు.
Also Read: Andhra King Taluka Trailer: ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి!
రెండవ దశలో మార్చి 1నుంచి మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాంకేతికను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు.