రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా.. తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ముందుకొచ్చింది.
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. చిట్ చాట్లో మంత్రి మాట్లాడుతూ.. "కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది.
Harish Rao: సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల…
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్తో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ సోమవారం సమన్లు పంపింది.
Grama Sabalu : చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈనెల 26 నుండి ప్రారంభం కానున్నాయి. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించగా, మండల…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల…
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు- నష్టపోతున్న లక్షలాది మంది తెలంగాణ లబ్దిదారులు అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని, అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు…
Bhatti Vikramarka : ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను…