CM Revanth Reddy : రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు…
Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం…
Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? అని లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే… నేటి వరకు 65 లక్షల మంది…
సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు గ్రామ మాజీ సర్పంచ్ బండి వెంకన్నదే బాధ్యత అని, మల్లేపల్లి గ్రామం చాలా మంచి గ్రామం అందుకే కలెక్టర్ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారని, ఖమ్మం జిల్లా అన్ని సంక్షేమ పథకాల అమలు అధికారులు బాగా చేస్తున్నారని సీఎం దగ్గర ఉందన్నారు. ఇందిరమ్మ…
Harish Rao : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో…
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read:…
Komatireddy Venkat Reddy : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అనంతరం బహిరంగసభలో పాల్కొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దేశంలో తన సంపదలో సగానికిపైగా ప్రజల కోసం పంచిన…
రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.