Off The Record: సీఎం రేవంత్ తన విజన్‌ను అధికారులతో క్లారిటీగా చెప్తున్నారు. దానికి అనుగుణంగా పని చేయండి అని సూచిస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మీరు మారండి…గ్రౌండ్‌కి వెళ్ళండి అంటూ ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతీ నెలా రిపోర్ట్ చూస్తాం అని మొత్తుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయికి వెళ్తే…భయంతోనో…తనిఖీలకు వస్తారనో జాగ్రత్తగా విధులు నిర్వహించే అవకాశం ఉంది.…