ఢిల్లీలో టీఆర్ ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. పారా బాయిల్డ్ రైస్ ను కొనలేమని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. 2021-22 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరింది. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.…
తెలంగాణ రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగాచేస్తున్నాయని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సీఎం కేసీఆర్‌వి వికృత చేష్టలు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో కేసీఆర్ ది దొంగ దీక్ష.. . రైతులను దగా చేసే కుట్ర అన్నారు. రంగస్థలం సినిమాలో జగపతి బాబు లెక్క… కేసీఆర్ తయారయ్యారన్నారు శ్రవణ్. బీజేపీ..టీఆర్‌ఎస్‌లు డ్రామాలు చేస్తున్నాయి. ఇద్దరూ ధర్నాలు చేస్తే… రైతులను ఆదుకునేది ఎవరు .? ఉప్పుడు బియ్యం ఇవ్వం అని చెప్పింది…
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతులతో మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా…
తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి.…
తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…
వరి విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోంది తప్ప రాష్ట్రానికి మేలు చేయడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏంలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ…
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ…