ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. కాన్వాయ్ లేకుండానే ప్రగతి భవన్ నుంచి రాజ్‌భవన్‌కు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.
ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకున్నారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామన్నారు. తనపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్‌కు వెళతారని సమాచారం.
కాంగ్రెస్ విజయం ఖరారైన అనంతరం టీపీసీసీ చీఫ్ కీలక ప్రెస్మీట్లో మాట్లాడారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని ఆయన అన్నారు. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు..
తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు 3749 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
High tension at Ibrahimpatnam RDO Office: ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిన్న రాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ అడ్డుకోబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు సల్ప లాటి ఛార్జ్ చేశారు. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కి అధికారులు పంపించ లేదని కాంగ్రెస్ నేతలు గుర్తించారు. ఈ విషయం తెలిసి ఆర్డీవో కార్యాలయానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో తరువాత పోస్టల్ బ్యాలెట్ లను…
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు.
Telangana Elections 2023 Attack at Sirpur Kagajnagar: తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 40 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించగా దీంతో పలు పోలింగ్…