Telangana Elections : తెలంగాణలో పోలింగ్ షురూ అయింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓట్లు వేయడమే మానేశారు. దేశంలో అయితే ఇంకా తక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం ఓటింగ్ జరిగింది. అంటే మిగిలిన 33 శాతం మంది ఓటేయలేదు. ఆ మొత్తం మందికూడా ఓట్లేస్తే ఫలితం ఎలా ఉండేది ? . వాస్తవానికి పల్లెల్లో కన్నా పట్టణాల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవుతోంది. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరు తమ ఓటును ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది ఎంతో పవిత్రమైనది. దానికి ఎంతో సార్థకత ఉంది. ఓటును నోటుకు అమ్ముకోకుండా విలువైన వజ్రాయుధంగా మల్చుకోవాలి. ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ‘ప్రజాస్వామ్య’ పద్ధతిలో ఎన్నుకోవాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ యువత ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.
Read Also:Telangana Elections 2023: ప్రారంభమైన పోలింగ్.. మొరాయిస్తున్న ఈవీఎంలు!
సెలవు ఇచ్చినా ఓటింగ్ తక్కువే.
పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణాల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది. ఎన్నికల రోజును ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. అయినా ఓటు వేయడానికి జనాలు బద్దకిస్తున్నారు. హాలీడే వచ్చిందని సొంత పనులు చేసుకుంటున్నారు. ఓటు ప్రాధాన్యతను గుర్తించలేకపోతున్నారు. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారు.
Read Also:DGP Anjani Kumar: తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి..