Chiranjeevi and Venkatesh Cast His Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణికొండలో సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. దర్శకుడు తేజ కూడా ఓటేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో సుశాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ కూడా సామాన్యుల వెనుక వరుసలో నిలబడి.. తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Chiranjeevi Vote