Kasani Gnaneshwar React on TDP Contesting In Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని తాను కలిశానని, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి వివరించానని కాసాని తెలిపారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు.…
Bodhan Municipal Chairman Padma Sharath Reddy Joins Congress Today: తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారం రంగంలోకి దిగేశాయి. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్‌ఎస్.. ప్రచారంలోనూ అదే ఊపుతో దూసుకెళుతోంది. అయితే మరోసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా…
ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ వాళ్లు కాపీ కొట్టారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ తన మార్క్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మొదటి సారి పూర్తిగా సంక్షేమ అజెండా తెలంగాణ పునర్‌నిర్మాణం పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్, రెండోసారి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను వెల్లడించారు. ఇప్పుడు మూడోసారి అదే పంథాతో ముందుకు సాగుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమావేశం కానున్నారు. పార్టీ అభ్యర్థులకు గులాబీ బాస్ బీ-ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం.. అనంతరం 12.15 నిమిషాలకు మ్యానిఫెస్టో విడుదల, మ్యానిఫెస్టోపై ప్రసంగం చేయనున్నారు.
Election Code: కొందరు ఇతరులను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. మరికొందరు ఆ పోస్టులపై కామెంట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
CLP Leader Mallu Bhatti Vikramarka Slams BRS: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే.. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సంపద, వనరులను ప్రజలకు పంచుకోవడం కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణను.. దశాబ్ద కాలంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భట్టి…
Congress Candidates List likely to be finalized tomorrow: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ డేట్ వచ్చేయడంతో ‘ఎన్నికల యుద్ధం’ మొదలైపోయింది. ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘కాంగ్రెస్ పార్టీ’.. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్ధుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ముమ్మర కసరత్తు చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు…
తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు.