బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసింది.
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
Vivek Venkataswamy: నేను బీజేపీకి రాజీనామా చేయ్యనని.. రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను బీజేపీకి రాజీనామా చేయడం లేదు' అని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు.
BJP Releases First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది.
Congress to announce Second List after Dussehra: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. దసరా పండగ తర్వాత రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ…
Kodandaram: తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సుయాత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు.
Off The Record: తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమేరకైనా… అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ కేంద్ర నాయకత్వం… ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఓవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతుంటే… తాము మాత్రం ఏ క్లారిటీ లేక కామ్‌గా చూస్తూ ఉండాల్సి వస్తోందని బాధ పడుతున్నారట తెలంగాణ కాషాయ నేతలు. ఎందుకిలా జరుగుతోంది? ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆరా తీస్తున్న నేతలకు వెయిట్…. వెయిట్… ఒకటి రెండు రోజుల్లో మీ నంబర్…
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వేదికగా కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రారంభించారు.