ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు.
బీసీలను కేటీఆర్ అవమానించారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
Kukatpally Congress Candidate Bandi Ramesh Slams BRS Govt: గడీల మధ్య తెలంగాణ బందీ అయిందని, ఒక హోం మంత్రికి గెటు లోపలికి కూడా అనుమతి ఉండదని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ విమర్శించారు. ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారని మండిపడ్డారు. సూటు కేసుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం తాను వచ్చానని బండి రమేష్ తెలిపారు.…
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, brs, telangana elections 2023
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్ లో ఖర్గే పాల్గొననున్నారు. సంగారెడ్డి గంజి మైదాన్ లో మధ్యాహ్నం 12 గంటలకు 30 breaking news, latest news, telugu news, mallikarjun kharge, congress, telangana elections 2023
వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ విజయభేరీ యాత్ర జరిగింది. అంబేడ్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నాడని విమర్శించారు.
కార్యకర్తలే తన బలమని.. మధిర నియోజకవర్గ ప్రజలే తన ఊపిరి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తన ఆశయమని ఆయన వెల్లడించారు.
గతంలో తెలంగాణ సాధన కోసం అధికార పార్టీని వదిలి ఇంటింటికి తిరిగి 33 ఓట్ల మెజారిటీతో గెలిచానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ప్రతీ రోజు కేసీఆర్ పిలుపుతో ప్రజలల్లోకి వెళ్లాను, పల్లె నిద్రలు చేస్తూ ప్రజలతో గడిపానని ఆయన తెలిపారు.