తనకు బీఫాం ఇచ్చి ఆశీర్వదించి సీఎం పంపించారని బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. తన రాజకీయ జీవితం నియోజకవర్గానికి కేటాయించానని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని ఆయన అన్నారు. అవినీతిపరుల పార్టీగా మారిందని మంత్రి విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి నేతలు తెరపైకి వచ్చారు. మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరం పెరుగుతోంది.
కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.
తెలంగాణలో ఎన్నికల వేళ ఆయా పార్టీలు బరిలోకి దించే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. దీంతో.. మునుగోడు కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. breaking news, latest news, telugu news, munugodu congress, Telangana Elections 2023
ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మా మద్దతు పలుకుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో మాదిగల విశ్వరూప మహా సభలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటాల తూటాలు అధికమవుతున్నాయి. తాగా నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు.
కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ చిచ్చు జరుగుతోంది. ఆదివాసీలకు అన్యాయం చేశారంటూ టికెట్ ఆశించిన మర్సుకోల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని.. ప్రజలు నన్ను గెలిపియ్యడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.