బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొన్నారు. అధికారిగా ఉన్నప్పుడు చాలా పరిమితులు ఉంటాయని.. రాజకీయాల్లో ఉంటే పరిమితులు ఉండవన్నారు. ఖాకీ, ఖద్దరు రెండు బాగానే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా మాత్రమే చూశాను.. ఇంద్రుడు, చంద్రుడు అని ఎప్పుడూ పొగడలేదన్నారు.
కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం కరీంనగర్‌లో 59వ వార్డులో పర్యటించిన ఆయన బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని పెద్దపెద్ద సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెప్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులో అభ్యర్థి సంతకం పార్టీ ప్రెసిడెంట్ సంతకాలు ఉంటాయని తెలిపారు. గ్యారెంటీ కార్డు అనేది అప్పు పత్రం…
కరీంనగర్ ఎన్నికల ప్రచారం మరింత ఆసక్తిగా మారాయి. గత మూడు రోజులుగా ప్రచారంలో గంగుల జోరు తగ్గిందా? అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గంగులకు మద్దతుగా కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల భార్యలు ప్రచారంలోకి దిగారు. గంగుల గెలుపు కోసం ఆయన సతీమణి రంగంలోకి దిగారు. ఆమెతో పాటు ప్రముఖ ముఖ్య నేతల భార్యలు కూడా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. Also Read: IND vs AUS T20: విశాఖ వేదికగా తొలి…
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే... మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు.
చొప్పదండి ప్రచారంలో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై కేటీఆర్ నోరు పారేసుకోవడాన్ని ఆయన ఖండించారు. బుధవారం చొప్పదండి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కేటీఆర్, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా? అని మండిపడ్డారు. ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం…
తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచారంలో దూకుడు పెంచాయి. అలాగే మద్దుతుగా ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం నల్గొండలో ప్రచారం చేపట్టారు. నల్గొండ చేరుకున్న ఖర్గే.. మొదట ఫ్లోరైడ్‌తో పోరాడి చనిపోయిన అంశల స్వామికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన…
వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే…
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరో వివాదంలో ఇరుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో పోలీసులను బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయానికి మించి ప్రచారం చేయడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ని బెదిరించాడు.