కరీంనగర్ ఎన్నికల ప్రచారం మరింత ఆసక్తిగా మారాయి. గత మూడు రోజులుగా ప్రచారంలో గంగుల జోరు తగ్గిందా? అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గంగులకు మద్దతుగా కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల భార్యలు ప్రచారంలోకి దిగారు. గంగుల గెలుపు కోసం ఆయన సతీమణి రంగంలోకి దిగారు. ఆమెతో పాటు ప్రముఖ ముఖ్య నేతల భార్యలు కూడా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Also Read: IND vs AUS T20: విశాఖ వేదికగా తొలి టీ20.. భారత్-ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
అంతేకాదు ప్రచారంలో మరింత జోష్ నింపుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రచార పాటలకు మహిళలతో కలిసి డ్యాన్సులు, రీల్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఈ ప్రచారంలో మంత్రి గంగుల సతీమణి రజిత, మేయర్ సునీల్ రావు సతీమణి అపర్ణ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ భార్య డాక్టర్ మాధవి పాల్గొన్నారు.
Also Read: Mallikarjun Kharge: అహంకార సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలి..