Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
దేశ ద్రోహం కేసు, తెల్గి స్కాంలో మూడేళ్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారా నగర్‌లో జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని ప్రజలను కోరారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లాలోని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబ్బండ వర్గాల మద్దతు అందెల శ్రీరాములుకు లభిస్తుంది. ఈ క్రమంలో.. అందెల శ్రీరాములుకు ఆటో యూనియన్లు మద్దతు పలికాయి. చలాన్లతో మా పొట్ట కొడుతున్నారని ఆటో డ్రైవర్లు అందెలకు వివరించారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ అధికారంలోకి రాగానే ఆటోవాలాలకు ఉచితంగా PM ప్రమాదబీమా అందిస్తానని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్‌లో ఉన్నారు.. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు.
బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు.
Konda Vishweshwar Reddy: ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరని మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.ఆర్కే పురం డివిజన్ టీఎన్ఆర్ వద్ద కార్నర్ మీటింగ్ ఆయన మాట్లాడుతూ
Pawan Kalyan: బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిట్టలేదు అంటే ఆంధ్రలో మాదిరిగా తెలంగానలో బాగా తిరగలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రాలో గుండాల్ని రౌడీల్ని ఎదుర్కొని ఉన్నానంటే అది తెలంగాణ స్ఫూర్తి మాత్రమే అన్నారు.