చొప్పదండి ప్రచారంలో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై కేటీఆర్ నోరు పారేసుకోవడాన్ని ఆయన ఖండించారు. బుధవారం చొప్పదండి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కేటీఆర్, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా? అని మండిపడ్డారు. ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుంది..
మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాం హౌజ్‌లు కట్టుకున్నారని, పేదలకు మాత్రం గూడు కల్పించరా? అన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం సంగతేమైంది? అని ప్రశ్నించారు. ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ తాంత్రిక పూజలను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 5 లక్షల కోట్ల అప్పు చేశారు.. మరి ఆ అప్పు ఎట్లా తీరుస్తారు? ప్రశ్నించారు. అవినీతిలో బీఆర్ఎస్ కిటీకీలు తెరిస్తే… కాంగ్రెస్ ఏకంగా తలుపులా బార్లా తెరుస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనని, అధికారంలోకి వస్తే కుప్పకూలడం తథ్యమని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలు మడిచి పెట్టుకోండని.. గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇవ్వగలరా?