Group-1 Rankers Parents: పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో పేరెంట్ వాళ్ల బాధలను వ్యక్త పరుస్తున్నారు. వాళ్ల కన్నీటి గాధలు విన్న మిగతా వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా భర్తను కోల్పోయి రూ. 11 వేలకు చిన్న…
Nalgonda: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు. తమ ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలు తమకు చదువు నేర్పే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కానీ కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. అలాంటి ఓ కీచక గురువు.. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కౌన్సిలింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మొత్తం 172 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Council of Higher Education – TGCHE) శుభవార్త అందించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను TG Ed.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ – B.Ed) , TG P.E.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – B.P.Ed, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – D.P.Ed) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తాజాగా…
బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. 32,106 మంది ఎడ్‌సెట్ పరీక్ష రాయగా 30,944 మంది ఉత్తీర్ణత నమోదైంది. అంటే 96.38శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొదటి మూడు స్థానాల్లో అబ్బాయిలదే హవా.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్‌లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వివాదం ఇంకా పరిష్కారం కాకముందే.. ఓయూ భూవివాదం తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి.