రేపు జరుగబోయే ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరు తప్పుడు ప్రచారం చెయ్యెద్దని.. ముందుగానే వివరణ ఇస్తున్నాను అని జగ్గారెడ్డి చెప్పారు. గతం వారం రోజులుగా జ్వరంగా ఉంది. అందుకే కోర్ట్ కు కూడా హాజరు కాలేకపోయాను. వారెంట్ కూడా వచ్చింది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్…
తెలంగాణ ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ధరణిలో పట్టా ఉన్న భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు తూకంలో మోసం జరుగుతుందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి…
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ ఏర్పాట్లపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. గత ఏడేళ్లలో…
పంతం నీదా..నాదా అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ. చూస్తుండగానే పెద్ద సవాల్‌గా మారిందీ సమస్య. సభ నిర్వహిస్తామని ఒకరు.. వద్దని ఇంకొకరు భీష్మించడంతో పార్టీలో చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు ఆధిపత్యానికి పోటీ పడుతుండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రేవంత్, మహేశ్వర్‌రెడ్డిల మధ్య ఇంద్రవెల్లి సభ చిచ్చు! దళిత గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవ దండోరాకి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా నాయకుల మధ్య పంచాయితీ.. ఏకంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో…
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల…
కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? కర్టసీ కోసం టచ్‌లోకి వెళ్తున్నారా.. లేదంటే ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారా? అప్పట్లో కాదని వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ వాచ్! పార్టీ మారిన ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ సింబల్ మీద గెలిచి.. ప్లేట్ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై.. కొత్త పీసీసీ చీఫ్ వచ్చి రాగానే మాటల తూటాలు పెంచారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. కౌంటర్ అటాక్ చేసినా……
మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా ఇంకా అదే ఫీలింగ్‌లో ఉన్నారట ఆ నాయకుడు. బలహీనమైన ప్రత్యర్థుల చేతిలో వరసగా రెండుసార్లు ఓడినా తత్వం బోధపడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు సొంత పార్టీలో కీలక పదవులు దక్కినా ఆయనకు జ్ఞానోదయం కావడం లేదట. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారట ఆ మాజీ అమాత్యుల వారు. ఇంతకీ ఎవరా నాయకుడు? రాష్ట్రస్థాయి నేతగా చాలా పనులు ఉంటాయని చెబుతారు! దామోదర రాజనర్సింహ. ఉమ్మడి రాష్ట్రానికి…
తెలంగాణ పీసీసీ కార్యరంగంలోకి దిగబోతోంది. కొత్త టీమ్‌తో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళ సమావేశం కానున్నారు. రోజంతా పార్టీ ముఖ్య నాయకులతో భేటీలు నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పీసీసీ కొత్త టీమ్ ఎంపిక పూర్తయిపోవడంతో… కార్యాచరణ మొదలెట్టింది. ఇప్పటికే పార్టీ చాలా నష్టం జరిగిందనీ… ఇకపై యాక్షన్‌లోకి దిగాలని…
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు అంటే, సోనియా.. రాహుల్ గాంధీలు ఉన్నట్టేనని తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు కలిసి పని చేస్తామన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ఏది ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పదవి కోసం పోటీ పడటం సహజమని.. నిర్ణయం అయిపోయింది కాబట్టి, పార్టీని అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి కృషిచేస్తామన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నానన్నారు. మేము కొట్లడుడు బంద్ చేసి..…