Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం…
CRPF Strengthens Security at Telangana–Chhattisgarh Border: తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో భారీగా CRPF భద్రతా బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను భద్రతాబలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్ఫీఎఫ్ 39 బెటాలియన్‌ను సీఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "కర్రెగుట్టలపై అతితక్కువ కాలంలో పట్టు సాధించాం.. ఈ ప్రాంతాన్ని సేఫ్…
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో దాదాపు 20 మంది స్పాట్ లోనే మృతి చెందారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్‌లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు పోస్టర్లు అతికించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించారు. వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అదించారు. మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలంటూ నవీపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Nizamabad: నిజమాబాద్‌లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది…
Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
Husband Throws Wife: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్ పైనుంచి భార్యను తోసి హత్య చేసిన సంఘటన ఆదివారం నాడు అర్ధరాత్రి జరిగింది.
Hyderabad: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని P&T కాలనీ రోడ్ నంబర్ 2లో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా టపాసులు కాలుస్తుండగా, ఇంటి ముందు పార్క్ చేసిన కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.