ఏం కష్టం వచ్చిందో.. ఏమో..! 18ఏళ్లు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అద్దె ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో అల్లం బాలరాజు (40) అనే బెటాలియన్ కానిస్టేబుల్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ములుగు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ బాలరాజు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గంగారం 15వ బెటాలియన్ లో దాదాపు 18 ఏళ్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వహించాడు. ఇంటి నుంచి…
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kotha Prabhakar Reddy: సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా జరిగిన బహిరంగ సుమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాక, అవసరమైతే కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామని…
Forest Fire : కాళేశ్వరం ప్రాంతంలో కార్చిచ్చు మంటలు అదుపుతప్పి అడవిని కబళిస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో వేలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. దహనంల వ్యాప్తి కారణంగా దట్టమైన పొగ ప్రాంతమంతా కమ్మేసింది. మంటలు వ్యాపించడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పలువురు స్థానికులు బకెట్లతో నీళ్లు…
Fire Break : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కార్లు. రెండు ఆటోలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన కార్లు ఆటో లు పోలీస్ స్టేషన్ వెనకాల ఖాళీ స్థలంలో ఉంచారు. ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ అవతలి భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు మంటను ఏర్పాటు చేశారు ఆ మంటలు చెలరేగి కార్లపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన…