Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల ఆశలు అడియాశలేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని ప్రయోగాలు చేసినా.. మరెన్ని కమిటీలు వేసినా.. తెలంగాణ బీజేపీలో అనుకున్నంత స్థాయిలో చేరికలు లేవా? బీజేపీ గేట్లు తెరిచినా ఇతర పార్టీల నుంచి ఎందుకు రావడం లేదు? ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా.. చేరికలపై ఏం చెప్పారు?
తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కమలనాథులు ఆ మధ్య బాకా ఊది మరీ చెప్పారు. మంచి రోజులు లేవు శ్రావణ మాసంలో ఎంత మంది వస్తారో చెప్పలేమని ఊదరగొట్టారు. శ్రావణ మాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తప్ప రాష్ట్రంలో చరిష్మా ఉన్న నాయకులు పెద్దగా కాషాయ కండువా కప్పుకోలేదు. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బొమ్మ శ్రీరామ్, రాజయ్య యాదవ్‌తోపాటు కొందరు రిటైర్డ్ అధికారులు మాత్రమే బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నేతలు ఆశించినట్టుగా వలస నేతల తాకిడితో పార్టీ గేట్లు తెగలేదు. తలుపులు తెరిచి కూర్చున్నా.. వచ్చే వాళ్లు వారికి కనుచూపు మేరలో కనిపించడం లేదు.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
చేరికలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. బీజేపీ నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందని.. త్వరలోనే ఆ ఆపరేషన్ ప్రభావం చూస్తారని చెబుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. చేరికలు లేవు.. ఆ మాటే మర్చిపోతున్న పరిస్థితి. అదిగో ఇదిగో అని పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. బీజేపీ గడప తొక్కి పార్టీ కండువా కప్పుకోవడం లేదు. వేచి చూడండి ఎంత మంది పార్టీలో చేరతారని బీరాలు పలకడమే సరిపోతోంది.
అంతకుముందు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో చేరికల కమిటీ వేశారు. తర్వాత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో కొత్తగా చేరికల కమిటీ వచ్చింది. ఈ విషయంలో స్పీడ్ పెంచాలనే ఉద్దేశంతో బీజేపీ ఢిల్లీ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కానీ… అధిష్ఠానం ఆశలకు తగ్గట్టుగా రాష్ట్రంలో ప్రయత్నాలు లేవన్నది కాషాయ శిబిరంలో వినిపిస్తున్న మాట. ప్రస్తుత చేరికల కమిటీలో కీలక నాయకులే ఉన్నారు. ఈ కమిటీలో ఉన్న నాయకులు ఇప్పటి వరకు భేటీ అయ్యి చర్చించింది లేదు. అధిష్ఠానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా.. చేరేందుకు సిద్ధంగా ఉన్నవారికి పూర్తి భరోసా ఇవ్వలేకపోతున్నారట. కమిట్‌మెంట్ ఇచ్చేందుకు సైతం కొందరు జంకుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలను బీజేపీలోకి లాగాలని చూసినా.. అది వర్కవుట్ కావడం లేదట.
రాష్ట్రంలో ఎన్నికలు, మంచి ముహూర్తాలు వస్తున్నాయి.. పోతున్నాయి. వరదలా బీజేపీలో చేరిక కలగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం అందరి దృష్టీ మునుగోడు బైఎలక్షన్‌పై ఉంది. అక్కడ ఫలితాన్ని బట్టి బీజేపీలో చేరాలా వద్దా అని వివిధ పార్టీలలోని నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం చెప్పుకొనే సమాధాన పడుతున్నారట బీజేపీ నేతలు. మునుగోడులో గెలిస్తే.. బీజేపీలోకి వలసలను ఆపలేమని కొత్త రాగం అందుకుంటున్నారు. మునుగోడులో ఫలితం ఆశించినట్టు రాకపోతే ఏంటన్నదానికి ఎవరూ జవాబు ఇవ్వడం లేదు.
తాజాగా రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత… కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చేరికలపై ప్రత్యేకంగా అమిత్ షా ఆరా తీశారు. బీజేపీలో ఇతర పార్టీల నాయకులు ఎందుకు చేరడం లేదు అని గట్టిగానే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆపై నేతల నుంచి వచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కొత్త వ్యూహం ఎంచుకుంటారో లేక.. కాలం కలిసొచ్చే వరకు వేచి ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!