Off The Record: తెలంగాణ అసెంబ్లీలో మొన్నటి వరకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. వివాదాస్పద వ్యాఖ్యల ఘటనలో రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని నోటీసు కూడా ఇచ్చింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా.. రాజాసింగ్ జైలు నుంచి బయటకొచ్చి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా.. బీజేపీ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలిపోయింది. రాజసింగ్ సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోకపోగా.. ఆయన…
ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు శాసన సభలో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 4వ సారి. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని అన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.
అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే అన్నారు. కుటుంబ పెద్ద కేసీఅర్ అని కేటీఆర్ తెలిపారు. పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సి వస్తె అది కాంగ్రెస్ సర్కార్ నే అన్నా మంత్రి కేటీఆర్ మోడీ పనితీరు గురించి మాట్లాడాలని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నగర అభివృద్ధి పై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉర్దూకు రెండవ అధికార భాషా తెలంగాణ సర్కార్ ఇచ్చిందని, కానీ ఉర్దూకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని అన్నారు.
ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్, 8న పద్దులపై చర్చ నిర్వహించనున్నారు. కర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ను 6న ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
గవర్నర్ ప్రసంగంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై బయట చాలా నరికిందని ఎద్దేవ చేశారు. పులి తీరుగా బయట గాండ్రించిందని అన్నారు. పిల్లి తీరుగా సభలో ప్రసంగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Off The Record about BJP Floor Leader in Telangana Assembly: తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వివరణ ఇవ్వాలని నోటీసులు ఇస్తే… వాటికి రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో బీజేపీకి పార్టీ ఫ్లోర్…
రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది.