తెలంగాణలో గెలిచే ఒకటో రెండో సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందా హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో బీజేపీ ఒకే సీటు గెలిచిందని, ఈసారి కూడా ఒక్క సీటు మాత్రమే వస్తుందన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీజేపోడు బావి దగ్గర మీటర్ పెడుతా అంటున్నాడు.. కాంగ్రెసోడు మూడు గంటల…
కుటుంబ పెత్తనం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం బీజేపీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి, అస్థిరత ఉంటుందని, బీఆర్ఎస్ కుటుంబ పెత్తనం పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానమని.. ధర్మం, దేశం బీజేపీ విధానమన్నారు. ఉద్యోగులకు ఒకటో…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై వైఎస్ షర్మిలా స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని కేసీఆర్ ఐటీ దాడులకు పాల్పడుతున్నాడన్నారు. Also Read: YSRCP: జనసేనకు బిగ్‌షాక్.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు ఎన్నికల్లో…
Divya Vani Comments After Joins in Congress: బంగారు తెలంగాణ కాంగ్రెతోనే సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తిగా మారుస్తూ బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ మణిక్ ఠాక్రే ఆమెకు కండువా కంపి ఫార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌లో పనిచేయాలనే హస్తం పార్టీలో చేరానన్నారు.…
Balmuri Venkat Fires on KTR: కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో బుధవారం కాంగ్రెస్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. కేటీఆర్ విద్యార్థులను ఐటీ హబ్‌కు పిలిపించి అంతా బాగుందనే చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే సన్నాసులు అని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల తిరుగుబాటుకు…
Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో లు నిర్వహించబోతున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.