కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామాన్ ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె మంగళవారం తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆమె అక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లోటు బడ్జెట్‌కు తీసుకువచ్చిందన్నారు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో తెలంగాణలో ధనిక రాష్ట్రమని, తొమ్మిదేళ్ల పాలనలో…
రాజన్న సిరిసిల్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. నన్ను గెలిపిస్తే సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరి చేపిస్తాను అని హామీ ఇచ్చారు.
హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేశామంటున్నారు.. కానీ, హుస్నాబాద్ మూడు దిక్కుల అభివృద్ధి చెందుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్‌కు మద్దతుగా హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ జరిగిన బీఆర్‌ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ మేరకు హరీష్ రావు మాట్లాడుతూ.. వంద అబద్ధాలు అడైనా కాంగ్రెస్ అధికారంలోని రావాలని చూస్తోందని, గతి, సుతి లేని కాంగ్రెస్ నున్నమితే…
2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేది అని నిర్మలా సీతారామన్ అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చిండు.. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్.. కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఆమె ఆరోపించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. కరెంట్ వెలుగులు తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ కరెంట్ తెస్తే.. కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ చూస్తోంది కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు దర్శించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరావు భద్రాద్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పోదేం వీరయ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ సభలో ఆయన మాట్లాడుతూ.. కోట్లు సంచలతో కొనాలని చూసినా…
CM KCR: భట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు.
CM KCR: ఆషామాషీగా పని చేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారలో భాగంగా.. సీఎం కేసీఆర్ మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అభాండాలు, అబద్ధాలు, హామీలు ఇవ్వడం దేశంలో ఎన్నికల సమయంలో
Shabir Ali: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం చేస్తామని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.