Telangana Assembly 2024: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. నేడు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదల మాట్లాడనున్నారు. అటు రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ లో కొత్త విద్యుత్ పంపిణీ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందుబాటులో ఉండే దాన్ని సభలో చర్చించే ఛాన్స్ ఉంది.
Read also: Tamanna : నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?
శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి పొంగులేటి భూభారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఫార్ములా ఈ-రేస్ పై చర్చ జరగాలని, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే చర్చ జరగాలని హరీష్ రావు పట్టుబట్టారు. చేతులు జోడించి చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. ప్రభుత్వ బిల్లు ఉందని, తన కార్యాలయానికి వస్తే చర్చిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చించాలన్నారు. హరీష్ రావుతో స్పీకర్ మాట్లాడుతూ.. మీకు అసెంబ్లీ సంప్రదాయాలు తెలియదా. మీరు కావాలనే అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు.
మీ ప్రవర్తన వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా సభలో సభ్యులు లేచి పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూనే సభ్యులు కాగితాలను చించి రెండుసార్లు స్పీకర్ పోడియంపైకి విసిరారు. కొద్ది క్షణాల తర్వాత సభ్యులు మార్షల్స్‌ను తోసుకుంటూ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ 45 నిమిషాల పాటు వాయిదా పడింది. మళ్లీ 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే మంత్రి పొంగులేటి మాట్లాడారు. సభలో సభ్యుల ఆందోళన ఆగలేదు మళ్లీ ఆందోళన ఉధృతమైంది. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొనడంతో సభను మళ్లీ 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది.
Fire Accident: మాదాపూర్ ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు..