సైన్స్ పెరుగుతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.. అలాంటివి చెయ్యొద్దు అంటున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. ఇప్పుడు ఎందుకు ఇది చెబుతున్నాం అంటే తాజాగా తెలంగాణ లో ఓ ఆచారం ఉంది.. మగవారి కోసం.. ఊరి చివరకు వెళ్లి చీపుర్లు, చెప్పుల తో వాళ్లను వాళ్ళే కొట్టుకుంటారు.. అనంతరం ఆ బట్టలు విప్పేసి అక్కడే పడేసి ఇంటికి వస్తారు.. ఈ ఆచారం తెలంగాణ లోని జగిత్యాల లో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్ మండలం పాత దాంరాజుపల్లిలో గ్రామస్థులు ఏటా చీపుర్లు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకుంటారు. అనంతరం గ్రామ శివార్లలోకి వెళ్లి ఆ చీపుర్లను, తాము వేసుకున్న దుస్తులను పడవేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగకూడదని, రోగాల బారిన పడకూడదని కోరుతూ ఏటా ఈ సంప్రదాయాన్ని పాటిస్తామని పాతదాంరాజుపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.. అక్కడి వారంతా మొహాలకు రంగులేసుకుని, పాత బట్టలు కట్టుకొని చీపుర్లు చేత పట్టుకుని గ్రామమంతా తిరుగుతారు. అలా ఊరంతా తిరిగిన తర్వాత గ్రామ శివారుకు చేరుకుని పాత బట్టలు, చీపుర్లు అక్కడే పడేసి వస్తారు.
గ్రామానికి ఎలాంటి చీడ ఉండొద్దని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాల తో ఉండాలని జట్టక్కను తరిమికొట్టేందుకు ఏడాదికి ఒకసారి ఇలా చేస్తుంటారు.. ఊర్లో ఇంటికి ఒకరు చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇళ్లలో ఉన్న పాత వస్తువులు, బట్టలు, చీపుర్లు అన్ని పట్టుకొని ఒకరినొకరు కొట్టుకుంటూ గ్రామ శివారు వరకు వెళ్తారు. అక్కడ చీపుర్లు, బట్టల ను చెట్లకు కట్టేసి వెనుకకు తిరిగి చూడకుండా ఊర్లోకి వచ్చేస్తారు.. ఇలా చేస్తే ఆ ఊరికి ఎటువంటి హానీ కలగ కుండా సుఖ శాంతులు వస్తాయని వారి నమ్మకం.. ఈ ఆచారం తర్వాత పొలం పనులు మొదలుపెడతారు..వందల ఏళ్ల నుంచి ఇదే ఆచారం ఉందని వారు చెబుతున్నారు.. అయితే విచిత్రం ఏంటంటే ఆ ఊరిలో మరణాలు తక్కువట.. వాళ్ళు తిన్న దెబ్బలే అలా వారిని కాపాడుతున్నాయని అంటున్నారు..