టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ఎంపీ సంతోష్ కుమార్‌ను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఎంపీ సంతోష్‌ను ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్, శైలజ, రాఘవ కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా…
వరంగల్ నేషనల్ హైవే వెంట యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హెచ్ఎండిఏ గ్రీనరీని పెంబర్తి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాయగిరి వరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ పూర్తి అయింది. అదనంగా 26 కిలోమీటర్లు మల్టీ లేయర్ ప్లాంటేషన్ కు సన్నాహాలు చేస్తోంది. యాదాద్రి హైవే గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవేని కూడా అభివృద్ధి చేయనున్నారు. మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై ఎన్ హెచ్ఏఐ ఆసక్తి కనబరుస్తోంది. యాదాద్రి సెంట్రల్ మిడెన్ ను…
అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్‌ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.…
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 22 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తరువాత, అక్టోబర్ 25 వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజున రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. ఎంపిక అనంతరం,…