సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ పరపతి బాగానే పెరిగింది. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరి కోసం మాటామంతీ’ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని…
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీచేసింది.
Duvvada Srinivas: దువ్వాడ వాణి రోజుకో రకంగా మాటాడుతున్నారు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలను ఇంటిపైకి పంపించారు.. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారు.. ఆస్తులపై మాట్లాడారు.. తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా.. ఒకవైపు పెద్దమనుషులను పంపిస్తూ..
Duvvada Vani: శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో గత పది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన చేపట్టిన జడ్పీటీసీ దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ పిల్లల కోసమే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటామని తెలిపింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారంపై వాడివేడీగా చర్చ సాగుతోంది.. ఓ వైపు ఆయన.. మరోవైపు భార్యా పిల్లలు.. ఇంకో వైపు మాధురి.. ఇలా ట్విట్టుల మీద ట్విస్టులు.. మలుపుల మీద మలుపులు అన్నట్టుగా సాగుతోంది ఈ వ్యవహారం.
ఎన్టీవీతో మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాది ముప్పై ఏండ్ల వైవాహిక జీవితం. గత రెండేళ్లుగా తీవ్రవిభేదాలు నడుస్తున్నాయి.. ప్రతి రోజూ మా ఇంటిలో గొడవలే. నా భార్యకు ఉన్న రాజకీయం కాంక్ష , ఆధిపత్యపోరే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు.. నేనే ఎమెల్యే కావాలి, బిజినెస్ నాపేరున ఉండాలి అనేది ఆమె వైనంగా పేర్కొన్న ఆయన.. పెళ్లి అయిన ఒకటి రెండు ఏళ్లకే ఇది మొదలైంది అని ఆవేదన వ్యక్తం…
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కారులో నిరీక్షిస్తున్నారు టెక్కలి జడ్పీటీసీ, శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి.. అయితే, గత రాత్రి కుమార్తెలు నిరీక్షించి.. దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఈ రోజు ఆయన భార్య కూడా వచ్చారు..
వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్
టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపిందట.. దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు టాక్ వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.