Duvvada Srinivas Controversy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారంపై వాడివేడీగా చర్చ సాగుతోంది.. ఓ వైపు ఆయన.. మరోవైపు భార్యా పిల్లలు.. ఇంకో వైపు మాధురి.. ఇలా ట్విట్టుల మీద ట్విస్టులు.. మలుపుల మీద మలుపులు అన్నట్టుగా సాగుతోంది ఈ వ్యవహారం.. ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టుగా కత్తులు దూసుకోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
Read Also: CM Chandrababu: నేడు మూడు కీలక శాఖలపై సీఎం సమీక్ష.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై నేడు క్లారిటీ..!
శ్రీకాకుళం రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు దువ్వాడ శ్రీనివాస్.. ఆయనకు కుటుంబంలోనే కాదు.. రాజకీయాల్లోనూ దురదృష్టమే వెంటాడింది.. ఎన్ని పార్టీలు మారినా.. పెద్దగా విజయాలు మాత్రం వరించలేదు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.. 2001లో శ్రీకాకుళం జిల్లా యువతన కాంగ్రెస్ కార్యదర్శిగా.. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు.. ఇక, 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసినా విజయం వరించలేదు.. 2014లో వైసీపీ అభ్యర్థిగానూ విక్టరీ కొట్టలేకపోయారు.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా గెలవలేకపోయారు.. 2021లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన పెద్దల సభలో ప్రవేశించారు..
Read Also: Helicopter Crash : ఆస్ట్రేలియాలో హోటల్ పైకప్పుపై కూలిన హెలికాప్టర్
ఇక, దువ్వాడ శ్రీనివాస్-వాణికి పెళ్లి జరిగి దాదాపు 30 ఏళ్లు అయ్యింది.. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు.. ఇద్దరూ డాక్టర్లే.. ఒకరికి పెళ్లి అయ్యింది.. అయితే, భార్యభర్తల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని తెలుస్తోంది.. రాజకీయ కారణాలు వాటికి ఆజ్యం పోసాయి అంటారు.. ఇలాంటి సమయంలోనే దువ్వాడ జీవితంలోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది.. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వైసీపీ కార్యకర్త కూడా.. పార్టీలోకి వచ్చిరాగానే మండల పార్టీ అధ్యక్షురాలిని చేశారు దువ్వాడ.. ఇక, వివాదం చెలరేగడంతో.. చివరకు రాజీనామా చేశారు.. అయితే, రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్-మాధురి మధ్య సన్నిహిత్యం పెరిగిందని వాణి ఆరోపిస్తున్నారు.. అనేక ఆలయాలకు జంటగా తిరుగుతున్నారని జిల్లాలో జోరుగా చర్చ జరిగింది.. రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా పుకార్లు షికార్లు చేశాయి.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఇలాంటి ప్రచారాలను వారు ఖండించకపోవడం.. అసలే 2024 ఎన్నికల్లో టికెట్ రాజేసిన గొడవలతో కుటుంబంలో కల్లోలం రేగితే.. మాధురి ఎపిసోడ్ మరింత గొడవ రాజేసింది.. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు.. ఆ ఇంట్లోనే మాధురితో కలిసి ఉంటున్నారని భార్య ఆరోపిస్తోంది.. ఏ హక్కుతో ఆమె నా భర్తతో కలిసి ఉంటుందని దువ్వాడ వాణి ప్రశ్నిస్తోంది.. ఇక.. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లోని ట్విస్టులు.. అసలు ఏం జరుగుతోందనే పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..