Tejas Fighter Jet: పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం ఇదే తొలిసారి.
బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజస్ యుద్ధ విమానంలో ఆయన ఓ ట్రిప్ వేశారు.
తేజస్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్, అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి. అర్జెంటీనా అభ్యర్థన మేరకు, తేజస్‌లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది.
అర్జెంటీనా వైమానిక దళం కోసం భారత్‌లో తయారైన తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై అర్జెంటీనా ఆసక్తిని భారతదేశం శుక్రవారం అంగీకరించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అర్జెంటీనాలో రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా తేజస్‌పై చర్చలు జరిగాయి.