Pakistan – Afghanistan Conflict: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కోర్టు భవనం వెలుపల ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిని ఆత్మాహుతి దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనిని యుద్ధ ప్రకటనగా అభివర్ణించారు. ఈ దాడికి ఆయన ఆఫ్ఘనిస్థాన్‌ను నిందించారు. ఈ దాడికి పాకిస్థాన్ తాలిబన్ (TTP) బాధ్యత వహించిందని వార్తలు రావడంతో, రెండు దేశాల మధ్య…
Taliban: తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను ఉద్దేశించి తాలిబాన్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో మునీర్‌కు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ సైన్యం తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టకుండా, బదులుగా ఉన్నత సైనికాధికారులే స్వయంగా యుద్ధరంగానికి రావాలని టీటీపీ అగ్ర కమాండర్ మునీర్‌ని బెదిరిస్తూ వీడియోలో హెచ్చరించారు. Read Also: PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల…
Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్‌లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్‌గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
Pakistan: పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ చేపట్టిన ‘‘బాలాకోట్ ఎయిర్ స్టైక్స్’’ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అభినందన్ వర్థమాన్ అనుకోకుండా పాక్ ఆర్మీకి చిక్కారు. ఆ సమయంలో, ఆయనను పట్టుకున్న పాక్ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఇటీవల తాలిబాన్ దాడుల్లో హతమయ్యాడు. ఆయన అంత్యక్రియలను పాక్ సైన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
Pakistan : పాకిస్థాన్‌లోని మీర్ అలీ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీకి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ హింసాత్మక ఘర్షణ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
pakistan divided into 3 parts: దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే.. మరోవైపు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ), బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది చెబుతున్నదాని ప్రకారం మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ మూడు భాగాలు అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి పాకిస్తాన్ లో కీలమైన ప్రావిన్సులు అయిన బలూచిస్తాన్,…
సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో వరుసగా మూడోసారి పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచినట్లు యూఎస్ థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తాజాగా అంచనా వేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ద్వారా పెరుగుతున్న హింసతో సహా పలు భద్రత, మానవ హక్కుల సవాళ్లను పాకిస్థాన్ ఎదుర్కొంటుందని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తన 28 పేజీల నివేదికలో పేర్కొంది.