Kota: రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కోటాలో 18 ఏళ్ల జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కోటాలో వారం రోజుల్లో ఇది రెండో ఆత్మహత్య.