కోవిడ్ పేరు చెబితేనే ప్రపంచదేశాలు ఇప్పటికీ వణికిపోతున్నాయి.. ఎక్కడైనా వింత వ్యాధి వెలుగుచూసిందంటే.. దాని వెనుక కోవిడ్ మూలాలు ఉన్నాయా? అనే అనుమానంతో చూడాల్సిన రిస్థితి.. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇలా.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై దాడి చేస్తూనే వస్తోంది హమ్మారి.. మరి, కోవిడ్‌కు అంతం ఎప్పుడు? దాని బారినుంచి బయటపడేది ఎన్నడు? అనే సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ‍్ల్యూహెచ్‌వో) కరోనా ముగింపు దశపై ఓ ప్రకటన చేసింది.…
2020 లో కరోనా మహమ్మారి ప్రపంచంలో వ్యాపించడం మొదలుపెట్టింది. చైనాలో 2019 డిసెంబర్‌లో బయటపడ్డ కరోనా, ఆ తరువాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. చైనా నుంచి ఇటలీ, యూరప్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించింది. 2021 వరకు ప్రపంచం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో కరోనా పూర్తిగా సమసిపోతుందని అనుకున్నారు. కానీ, రూటు మార్చి, రూపం మార్చుకొని డెల్టా రూపంలో, ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతున్నది.…