Hong Kong Sixes 2025: భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ రాబోయే హాంకాంగ్ సిక్సర్స్ (Hong Kong Sixes) టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే ఈ షార్ట్ ఫార్మాట్ టోర్నమెంట్లో ఆయన కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అనుభవం, కచ్చితమైన నాయకత్వ నైపుణ్యాలు, అలాగే బ్యాటింగ్ స్టైల్‌తో కార్తీక్ అభిమానులకు ప్రేరణగా నిలుస్తారని నిర్వాహకులు…
ఆసియా కప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల…
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో…
ఆసియా కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరోసారి కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-4 దశలో దాయాది పాకిస్థాన్‌తో ఈరోజు రాత్రి 8 గంటలకు టీమిండియా తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన సూర్య సేన.. మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అనే చెప్పాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం కొందరు భారత్ ప్లేయర్స్…
ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్…
ఆసియా కప్ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్…
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే హోరాహోరీగా పోరు ఉంటుంది. ప్రతిక్షణం ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, బంతి బంతికి మలుపులు, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. ఇండో-పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. మ్యాచ్ చప్పగా సాగడంతో…
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ…
ఆసియా కప్ 2025లో భారత్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు ఖాయమైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం భారత్‌కు మ్యాచ్ లేదు కానీ.. ఒమన్‌ను యూఏఈ ఓడించడంతో టోర్నీలో సూపర్-4 చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4కు అర్హత సాధించడానికి ఇంకా ఒక జట్టుకే అవకాశం ఉంది.…