Shane Watson eye on Team India Head Coach Post: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అవకాశం వస్తే టీమిండియాకు కోచ్‌గా చేస్తానని తెలిపాడు. తనకు కోచింగ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అని వాట్సన్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు, మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టుకు అతడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.
ది ఫెడరల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ… ‘నేను కోచింగ్ ఇవ్వడాన్ని ఇష్టపడతా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో నాకు కోచింగ్ అవకాశం దక్కింది. ఢిల్లీలో రికీ పాంటింగ్‌కు నేను అసిస్టెంట్ (కోచ్)గా ఉండటం సంతోషం. మేజర్ లీగ్ క్రికెట్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో నేను కోచ్‌గా సేవలందించాను. భవిష్యత్తులో అవకాశం వస్తే.. భారత జట్టుకు కోచ్‌గా పని చేస్తా. ఎందుకంటే సహజంగానే భారతీయ క్రికెట్‌లో ప్రతిభ, నైపుణ్యాలు పుష్కలంగా ఉంటాయి. గొప్ప ఆటగాళ్లతో పని చేయాలనేది నా ఆలోచన. అందుకు భారత జట్టు మంచి ఎంపిక’ అని అన్నాడు.
Also Read: Sri Lanka Squad: ఐపీఎల్ స్టార్‌లకు చోటు.. శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే!
పాకిస్థాన్ కోచ్ పదవి రేసులో షేన్ వాట్సన్ ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అయితే వాట్సన్ పాక్ జట్టుకు కోచ్‌గా వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆ పదివి చివరికి గ్యారీ క్రిస్టన్‌ను వరించింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. నిజానికి వన్డే ప్రపంచకప్ 2023తోనే ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసింది. కానీ టీమిండియా ఆసియా కప్ గెలవడం, ప్రపంచకప్ ఫైనల్ వెళ్లడంతో ద్రవిడ్ టీమ్‌పై బీసీసీఐ నమ్మకముంచి.. కాంట్రాక్ట్‌ను పొడిగించింది. ఒకవేళ భారత్ కప్ కొడితే కోచ్‌గా ద్రవిడ్‌నే కొనసాగించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుంది. అయితే అతడు ఒప్పుకుంటాడో లేదో.