INDW vs SAW: స్వదేశంలో సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళ బ్యాటర్లు భారీగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (117) సాధించిన మంధన.. ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలోనూ శతకం (120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 రన్స్) బాదింది.
Read Also: SVC 59: తెలుగొస్తే సంతోషం.. విశ్వక్ దారిలో దేవరకొండ?
ఇక, ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన, హర్మన్ ప్రీతి కౌర్ సెంచరీలతో విజృంభించడంతో పాటు షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) రాణించారు. ఇక, సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ తీసుకుంది. అయితే, వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ కాగా.. టీమిండియా తరఫున అత్యధిక వన్డే శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో ఉంది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన స్మృతి మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) కూడా సమం చేసింది.
CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK
— Johns. (@CricCrazyJohns) June 19, 2024