ముంబై మున్సిపల్ కార్మికులకు గురువారం రాత్రి నుంచి చుక్కలు కనిపించాయి. నగరంలో ఎన్నడూ చూడని చెత్తను చూసి వర్కర్స్ అవాక్కయ్యారు. కొన్ని గంటల పాటు వేల కిలోల వ్యర్థాలు సేకరించి రికార్డు సృష్టించారు.
టీ20 క్రికెట్ ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియాకు దేశం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే భారత క్రికెట్ జట్టు విమానానికి వాటర్ క్యానన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు.
Team India Victory Parade : 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించి రెండోసారి ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీనికి ముందు 2007 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది. వన్డేల్లో 1983, 2011 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. ఈసారి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్…