ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కే అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్ చేర్చడం అతడికి కలిసి రానుంది. దీనిపై మరికొన్ని గంటల్లో…
రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాంతో త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. యువ ఆటగాడికే టెస్ట్ సారథ్యం అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య…