తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2014 జూన్ 2 ఏర్పడ్డ తెలంగాణ 2022లో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలకు సంబంధించి సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిచనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జిల్లాల వారీగా అవతరణ వేడుకకు సంబంధించి ముఖ్య అతిథులను…