తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2014 జూన్ 2 ఏర్పడ్డ తెలంగాణ 2022లో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలకు సంబంధించి సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిచనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా జిల్లాల వారీగా అవతరణ వేడుకకు సంబంధించి ముఖ్య అతిథులను కేటాయించింది ప్రభుత్వం. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అతిథులుగా వారికి కేటాయించిన జిల్లాల్లో జెండా ఆవిష్కరించనున్నారు.
జిల్లాల వారీగా ముఖ్య అతిథులు వీరే:
హైదరాబాద్- సీఎం కేసీఆర్
1.ఆదిలాబాద్ గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్
2.కొత్తగూడెం రేగా కాంతారావు
3.జగిత్యాల- మంత్రి కొప్పుల ఈశ్వర్
4.భూపాలపల్లి-రాజీవ్ శర్మ ప్రభుత్వ సలహాదారు
5.జనగామ-జీఆర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు
6.గద్వాల్-అనురాగ్ శర్మ ప్రభుత్వ సలహాదారు
7.కామారెడ్డి-స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
8.ఖమ్మం-మంత్రి పువ్వడా అజయ్
9.కరీంనగర్-మంత్రి గంగుల కమలాకర్
10.అసిఫాబాద్-అరికెపుడి గాంధీ
11.మహబూబ్ నగర్-మంత్రి శ్రీనివాస్ గౌడ్.
12.మహబూబా బాద్-మంత్రి సత్యవతి రాధోడ్.
13.మంచిర్యాల-బాల్క సుమన్
14.మెదక్-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
15.మేడ్చల్-మంత్రి మల్లారెడ్డి
16.ములుగు-ప్రభకర్ రావు ప్రభుత్వ విప్
17.నాగర్ కర్నూల్-గువ్వల బలరాజ్.
18.వనపర్తి-మంత్రి నిరంజన్ రెడ్డి
19.నిర్మల్-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
20.సిరిసిల్ల-మంత్రి కేటీఆర్
21.సిద్దిపేట-హరీష్ రావు
22.నల్గొండ-గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్
23.నిజామాబాద్-మంత్రి ప్రశాంత్ రెడ్డి
24.సూర్యాపేట -మంత్రి జగదీశ్ రెడ్డి
25.నారాయణ్ పెట్-రమణ చారి ప్రభుత్వ సలహాదారు
26.వికారాబాద్-డిప్యూటీ స్పీకర్ పద్మారావు
27.రంగారెడ్డి-సబితా ఇంద్రారెడ్డి
28.సంగారెడ్డి-హోమ్ మంత్రి మహమూద్ అలీ
29.పెద్దపల్లి-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
30.హన్మకొండ-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
31.వరంగల్-దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ విప్
32.యాదాద్రి భువనగిరి-గొంగిడి సునీత ప్రభుత్వ విప్.